Header Banner

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

  Mon Mar 03, 2025 18:33        Politics

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్లో లో 28వేల ఓట్లు లెక్కింపు పూర్తి కాగా.. కూటమి అభ్యర్థి ఆలపాటికి 17,246 ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు 7,156 ఓట్లు సాధించారు. మొదటి రౌండ్ తర్వాత ఆలపాటికి 10,090 ఓట్ల ఆధిక్యం ఉంది. మరోవైపు, రెండో రౌండ్లోనూ ఆలపాటిదే పైచేయిగా తెలుస్తోంది. మొత్తంగా తొమ్మిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఒక్కో రౌండ్లో 28వేల చొప్పున ఓట్లు లెక్కిస్తారు.

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 10మంది బరిలో ఉండగా.. ఏడుగురి ఎలిమినేషన్ పూర్తయింది. పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకు 7,272 ఓట్లు రాగా.. కూటమి అభ్యర్థి రఘువర్మకు దాదాపు 6,900, విజయగౌరికి 5,900 ఓట్లు వచ్చాయి.


ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

ఉత్తరాంధ్రలో మొత్తంగా 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు గుర్తించారు. 2.3శాతం ఓట్లు చెల్లనివిగా మిగిలాయి. ఈ స్థానానికి మ్యాజిక్ నంబర్ 10,068 ఓట్లుగా నిర్ణయించారు. పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు, కూటమి అభ్యర్థి రఘువర్మలలో ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా సరిపోకపోతే.. మూడో ప్రాధాన్యతకు వెళ్లే అవకాశం ఉంటుంది. 

తెలంగాణలో ఖమ్మం- వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలోని వేర్హౌ హౌసింగ్ గోదాంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మొత్తంగా 23,641 ఓట్లు కాగా.. 494 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూ) 6,035 ఓట్లు, నర్సిరెడ్డి (యూటీఎఫ్) 4,820, హర్షవర్దన్ (స్వతంత్ర అభ్యర్థి) 4,437, పూల రవీందర్ (స్వతంత్ర) 3,115, సరోత్తమ్ రెడ్డి (భాజపా) 2,289 ఓట్లు చొప్పున వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితం కోసం ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటివరకు ఉన్న సమచారం ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలే అవకాశం లేదని తెలుస్తోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

 

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TeacherMLCElection #Counting #NorthAndhra